ప్రభుత్వ పథకాలపై విశ్వసనీయ సమాచారం ప్రజలకు చేరువ చేయాలి-పి ఐ బి జాయింట్ డైరెక్టర్ వి బాలకృష్ణ.

 

సిరిసిల్లలో “వార్తాలాఫ్”వర్క్ షాప్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 18. (జనంసాక్షి). ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల విశ్వసనీయ సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయాలని పి.ఐ.బి జాయింట్ డైరెక్టర్ వి. బాలకృష్ణ అన్నారు. శుక్రవారం పి. ఐ. బి. సిరిసిల్లలో జర్నలిస్టుల అవగాహన కోసం చేసిన “వార్తా లాఫ్”ఒకరోజు వర్క్ షాప్ ను అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ప్రారంభించారు. జర్నలిస్టుల అవగాహన కోసం శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. పి ఐ బి ద్వారా అందిస్తున్న సేవలను జాయింట్ డైరెక్టర్ వి బాలకృష్ణ వివరించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఎస్. రాము “జర్నలిజన్లో ఉత్తమ పద్ధతులు’అనే అంశంపై ప్రసంగించారు ప్రస్తుతం సమాజంలో జర్నలిజం వృత్తిగా ఎంచుకున్న క్రమంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి ముందుకు సాగాలని సూచించారు. “సైబర్ సెక్యూరిటీ”అంశంపై జగదీష్ బాబు వివరించారు., పి ఐ బి హైదరాబాద్ కమ్యూనికేషన్ ఆఫీసర్ వరుగంటి గాయత్రి వర్క్ షాప్ ఉద్దేశాలను తెలిపారు. కార్యక్రమంలో డిపిఆర్ఓ మామిళ్ల దర్శనం జిల్లాలోని పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.