*ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ*
*ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో రానించాలి*
మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 18,
జనంసాక్షి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థిని, విద్యార్థులు చక్కగా చదువుకుంటూ అన్ని రంగాల్లో రానించాలని జగిత్యాల జిల్లా వంజరి సంఘం అధ్యక్షులు బొమ్మెల శంకర్ విద్యార్థులకు సూచించారు.మంగళవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి, మరియు మండలంలోని ఆత్మకూర్ గ్రామం లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తెలంగాణ రాష్ట వంజరి సంఘం ద్వారా వచ్చిన నోటుబుక్ లను పంపిణి చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా పోటీతత్వం తో చదివి ఉన్నత చదువులతో రానించి తోటి సమాజానికి దేశానికి తమ వంతు సేవలు అందించే విధంగా ఉన్నతంగా ఎదగాలని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం బాధ్యతగా ప్రతి విద్యా సంవత్సరం జిల్లాల వారిగా పాఠశాల పిల్లలకు ఉచితంగా నోట్ బుక్కులు విడుదల చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా వంజరి సంఘం అధ్యక్షులు బొమ్మెళ శంకర్ వెంట ఆమందు కృష్ణ ,మటేరి రంజిత్ కుమార్, నవ్వోతూ రాజేందర్ ,ధాత్రిక మహిపాల్, లక్ష్మి నారాయణ తదితర వంజరి సంఘం నాయకులు పాల్గొన్నారు .