ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు పెంపొందించాలి

 గరిడేపల్లి, అక్టోబర్ 13 (జనం సాక్షి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు తీవ్రమైన మౌళిక వసతుల కొరతతో సతమతం అవుతున్నాయని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించి మౌళిక వసతులు మెరుగు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  గురువారం టిపియుయస్ గరిడేపల్లి మండల శాఖ సర్వసభ్య సమావేశం మండల కేంద్రంలో నిర్వహించనైనది.  ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ మాట్లాడుతూ చాలా  ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు మూత్రశాలలు తరగతి గదులు సరిపడా లేవని  కొన్నిచోట్ల శిథిలావస్థలో ఉన్నాయని అన్ని పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులు లేక పాఠశాలలు అపరిశుభ్రపు  లోగిల్లుగా తయారవుతున్నాయని ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి సాధించి మౌళిక వసతులు మెరుగుపరచి  పారిశుధ్య కార్మికులను నియమించాలని కోరారు.  ఈ సమావేశంలో టిపియుయస్ గరిడేపల్లి మండల శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.  గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్  గా విధులు నిర్వర్తిస్తున్న  యడవెళ్లి  బుచ్చి రెడ్డి  మండల శాఖ అధ్యక్షులుగా గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలలో పీజీటీ గా పనిచేస్తున్న ఐతరాజు సుధాకర్  ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు మండల ఎన్నికల అధికారి దొంతగాని శ్యామ్ ప్రసాద్ ప్రకటించారు.  ఈ సమావేశంలో తపస్ జిల్లా నాయకులు తాటికొండ రవీందర్ రెడ్డి, రణబోతు పరం జ్యోతి, బానోతు  పూల్ సింగ్ , శ్రీ  రామ్ రెడ్డి , జనార్దనా చారి తదితరులు పాల్గొన్నారు.