ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

జహీరాబాద్ ఆగస్టు 18( జనంసాక్షి)
మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధి దశ చాలా కీలకమైనదని, సమయ పాలన పాటించాలని, చెడుకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించాలని, ప్రతీ విద్యార్ధి గురువులను, తల్లి దండ్రులను గౌరవించాలని, చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని సమాజానికి ఆదర్శవంతంగా, మార్గదర్శకంగా జీవించాలని సూచించారు. విద్యార్థులు , లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని, ఒకవేళ వాహనాలు నడిపి ప్రమాదానికి కారణమైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. విద్యార్థులందరూ పరిశుభ్రతను పాటించాలని అన్నారు. అత్యవసర సమయంలో 100 కి ఫోన్ చేసి సహాయం పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఎం.ఈ.వో బస్వరాజ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, పాఠశాల సిబ్బంది, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నా

 

తాజావార్తలు