ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కళ్ళకు గంతలు కట్టుకొని AISB ఆధ్వర్యంలో నిరసన.
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 5(జనం సాక్షి)
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ లో AISB ఆధ్వర్యంలో సోమ వారం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేశారు, ఈ కార్యక్రమానికి AISB రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభూత్వ విద్యను కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని,ప్రభూత్వ విద్యా సంస్థలు సమస్యలకు నిలయాలుగా మారాయని, సంక్షేమ హాస్టల్లో, నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఆసుపత్రుల, పాలవడం బాధాకరం అన్నారు, నాణ్యమైన భోజనం అందిస్తున్నామని,ప్రగల్భాలు పలికే పెద్దలు భోజనంలో కప్పలు రావడం, పురుగులు రావడం యావత్ సమాజం మొత్తం తెలిస్తే మీకు తెలియకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు, విద్యా సంస్థలలో వరుస ఆత్మహత్యలపై నేటికీ విచారణ జరుపకపోవడం దేనికి నిదర్శనం అని అన్నారు, అదే విధంగా తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు 3,300, కోట్లు వెంటనే విడుదల చేసి విద్యార్థులను, కళాశాల యజమాన్యాలను ఆదుకోవాలని కోరారు లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా AISB ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో AISB రాష్ట్ర కార్యదర్శి మొలుగూరి హరికృష్ణ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల హరీష్, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు కురువెల్లి శంకర్, AISB జిల్లా నాయకులు కలికోట అభిలాష్, విక్రమ్, భరత్ ,రాజేష్, నీరజ్ , అరుణ్ తేజ, తదితరులు పాల్గొన్నారు