ప్రభుత్వ విద్యా రంగంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలి. టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.ప్రభుత్వ విద్యా రంగంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.సోమవారం నాడు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త క్యాంపెన్లో భాగంగా దేశ విద్యా రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యుటిఎఫ్ నేరేడుచర్ల శాఖ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి.తహశీల్దార్ సరిత కు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్,మండల అధ్యక్షుడు సైదులు నాయక్,మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులు వెంటనే అందించాలని,మధ్యాహ్న భోజన బిల్లులను మంజూరు చేయాలని, ఎన్ఈపి2020 విద్య విధానం వెంటనే రద్దు చేయాలి,సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని,పునరుద్ధరించాలని,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల రెగ్యురైజ్ చేయాలని,ఉపాధ్యాయ బదిలీల,ప్రమోషన్ షెడ్యూల్ విడుదల చేయాలని, ఉపాధ్యాయుల నియామకం జరిగే వరకు తాత్కాలిక ఉపాధ్యాయులు నియమించాలని,పర్యవేక్షణ అధికారుల పోస్టులను డి.ఈ.ఓ, డి.వై.డి.ఈ.ఓ, ఎం.ఈ.ఓ లను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి సైదులు నాయక్, ఉపాధ్యక్షుడు కృష్ణయ్య,కోశాధికారి ఎల్లయ్య, యుటీఎఫ్ సీనియర్ నాయకులు.నరసింహారావు వెంకటేశ్వర రావు, వెంకట నరసయ్య, వెంకటేశ్వర్లు,రషీద్ ఖాన్,రమేష్ విజయ్ శేఖర్,కృష్ణ ప్రసాద్,జానయ్య,సిఐటియు నాయకులు రామ్మూర్తి తదితరులు ఉన్నారు.