ప్రభుత్వ విధానాలే… కార్మికుల పాలిట శాపం: ఏఐటీయూసీ

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి):

కేంద్రప్రభుత్వ విధానాలే కార్మికుల పాలిట శాపం గా మారాయని… సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఉప ప్రధానకార్యదర్శి, కేంద్ర ఉపా ధ్యక్షులు ఎం.దయాకర్‌రెడ్డి, వేల్పుల నారాయణ లు అన్నారు. మంగళవారం జిడికే-5వ గనిలో జరిగిన ద్వార సమావేశంలో వారు మాట్లా డుతూ… గత గుర్తింపు సంఘం ఎన్నికల సంద ర్భంలో తామిచ్చిన హామీలను నెరవేర్చామని, వాటిని ఓర్చులేకోలేని ఐఎన్‌టియుసి, టిబిజికేఎస్‌ కార్మిక సంఘాలు ఏఐటియుసిని విమర్శించి లబ్ది పొందాలని చూస్తున్నాయని వారన్నారు. కార్మికుల పక్షాన పోరాడేది ఏఐటియుసేనని వారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే వారసత్వ ఉద్యో గాలు ఆగిపోయాయని, వాటిని తాము తిరిగి ఇప్పిస్తామని  ఐఎన్‌టియుసి నాయకులు ప్రగాల్భా లు పలుకుతున్నారన్నారు. 6.6.98న 5 జాతీయ సంఘాలు కలిసే ఈ విషయంపై ఒప్పందం చేసుకున్నాయని, భవిష్యత్తులో సింగరేణిలో ఖాళీ లు వస్తే వాటిని కొనసాగించడానికి ఒప్పందం రాసుకున్నాయని వారన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో 5 జాతీయసంఘాలు బాధ్యతేనని వారాన్నరు. కేంద్రంలో కేసిఆర్‌ కేంద్రమంత్రిగా ఉండగా… టిబిజికేఎస్‌ వారసత్వ ఉద్యోగాలు ఎం దుకు ఇప్పించలేదని వారు ప్రశ్నించారు. తెలం గాణ కోసం తాము ఒకేమాటతో ఉన్నామని, శక ి్తవంచన లేకుండా పోరాడుతున్నామని, అయితే ఇప్పుడు జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికలు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు జరిగే కార్మిక సంఘం ఎన్నికలని వారన్నారు. తెలంగాణ ఇచ్చే అధికారం సింగరేణిది కాదని… అది కేంద్రప్రభుత్వం చేతిలో ఉందని, దానికోసం సిపిఐ, ఏఐటియుసిలు రాజకీయ పోరాటం చేస్తుం దన్నారు. కార్మికులు వారి సమస్యల పరి ష్కార దిశగా పోరాడే ఏఐటియుసేకే మద్దతు తెలుపు తారని వారన్నారు. ఈ గేట్‌మీటింగ్‌లో నాయకు లు బి.కనకయ్య, షబ్బీర్‌అహ్మద్‌, భాస్కర్‌,  మై సయ్య, ఓదేలుతో పాటు కార్మికులు పాల్గొన్నారు.