ప్రభుత్వ విప్ రేగా ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ వేడుకలు ..
కరకగూడెం,ఆగస్టు12(జనంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ లోని తన స్వగ్రామమైన కుర్నవల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారి స్వగృహం నందు అన్న_ చెల్లెలు అక్క_ తమ్ముళ్లు పవిత్ర బంధానికి పత్రిక అయినటువంటి రాఖి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కి వారి అక్క ,చెల్లెలు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.కరకగూడెం మండలం పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తోబుట్టువుల మధ్య అన్యోన్యతను ఇనుము డింప చేసేదే రక్షాబంధన్ మహోత్సవమని వారన్నారు, అలాంటి పర్వదినాన్ని జరుపుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు, సీఎం కేసీఆర్ నేతృత్యంలో కొనసాగుతున్న జన రం జకమైన పాలనలో ఆడపడుచులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఇదేనన్నారు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్, ఒంటరి మహిళలు, ఆసరా పింఛన్లు వంటి అద్భుతమైన సంక్షేమ పథకాలతో పాటు మహిళలకు రక్షణ వలయంగా షీ టీం ను ప్రవేశపెట్టి నారి లోకానికి రక్షణను అందిస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు, అటువంటి ప్రభుత్వంలో ఆనందోత్సవాలతో రక్షాబంధన్ జరుపుకుంటున్న మహిళలకు శుభా వందనాలు తెలియజేశారు.రాఖీ కట్టిన ప్రతి ఒక్క మహిళకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఎంపీపీ రేగ కాలిక, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్, మండల మహిళా అధ్యక్షురాలు లావణ్య, కరకగూడెం పాత్రికేయులు రఫీ, శ్రీను, లింగయ్య ,ఫారుక్, సురేష్, విజయ్, అప్రోజ్, వెంకట్ ,ప్రేమ్ ,ప్రవీణ్, భిక్షపతి, సర్పంచులు ఎంపీటీసీలు ,పలువురు టిఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.