-->

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పొన్నం పాదయాత్ర.

జనం సాక్షి,న్యూస్ శంకరపట్నం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు పొన్నం ప్రభాకర్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఊకంటి మధుకర్, ఎలుక పెళ్లి సంపత్ అన్నారు. శంకరపట్నం లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ బిజెపి పాలనలో సామాన్య ప్రజల పై నిత్యావసర ధరలు పెంచి పెనుభారం మోపిందన్నారు రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉప ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్తుందని విమర్శించారు ప్రభుత్వాల తీరుపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఈ నెల 9 నుండి పార్లమెంట్ పరిధిలో పొన్నం ప్రభాకర్ పాదయాత్ర చేపట్టాలన్నారు మానకొండూరు నియోజకవర్గం లో పాదయాత్ర సాగనున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికి విజయవంతం చేయాలని వారు కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోరం రాజిరెడ్డి సీనియర్ నాయకులు తుమ్మేటి రాజిరెడ్డి,లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.