ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫిల్మ్‌లు థియేటర్లకు విడుదల

కరీంనగర్‌, జూలై 22: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై నిర్మించిన 35 ఎంఎం డాక్యుమెంటరీ ఫిల్మ్‌లను జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో సోమవారం నుంచి ప్రదర్శిస్తున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌. అరుణ్‌కుమార్‌ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. స్వల్ప నిడివి గల ఫిల్మ్‌లు 1.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, 2.ఒక్క రూపాయికి కిలో బియ్యం, 3.రచ్చబండ, 4.ఇందిరజలప్రభలపై నిర్మించిన ఫిల్మ్‌లు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం ద్వారా అన్ని సినిమా థియేటర్లకు పంపించినట్టు ఆయన తెలిపారు. ఈ ఫిల్మ్‌లను సినిమా ప్రారంభానికి ముందు, విశ్రాంతి సమయాల్లో తప్పకుండా ప్రదర్శించాలని అన్నారు.