ప్రభుత్వ హాస్టళ్లలో ప్రవేశానికి ధరఖాస్తుల ఆహ్వానం

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూన్ 14 :  జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని వెనుకబడిన తరగతుల వసతిగృహాలలో 2022-2023 విద్యా సంవత్సరం (తెలుగు ఇంగ్లీషు మీడియం ) లలో  నూతన విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభమైనవని  జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి శ్రీమతి శ్వేత ప్రియదర్శిని ఒక ప్రకటనలో తెయజేశారు, ప్రభుత్వము ప్రతి సంవత్సరం వసతిగృహాలలో విద్యార్థులకు అందిస్తున్న ఉచిత నోట్ పుస్తకాలు,స్కూల్ యూనీఫార్మ్, బెడ్ షీట్, కార్పెట్స్, మరియు నాణ్యమైన భోజనము సదుపాయం కలిపిస్తున్నామని అలాగే విద్యార్థులకు బాలురకు నెలకు రూ:62/ -బాలికలకు రూ:75/-సబ్బు నూనెలకు ఇస్తామన్నారు, 10వ తరగతి విద్యార్థులకు టూటార్స్ చే ప్రత్యక తరగతులు నిర్వహిస్తున్నామని అలాగే 10వ తరగతిలో విద్యార్థులు ప్రతిభ చూపినవారికి ఇంటర్ కార్పొరేట్ కళాశాలలో ఉచితముగా ప్రవేశము కల్పిస్తామన్నారు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు (తెలుగు ఇంగ్లీషు మీడియం ) ప్రవేశాలు వసతి గృహాలయందు ప్రారంభమైనవని శ్రీమతి శ్వేత ప్రియదర్శిని తెలియజేశారు.
జిల్లాలోని వివిధ మండలలో అందుబాటులో ఉన్న వసతి గృహాల యందు అడ్మిషన్ కు కావాలసిన దృవపత్రాలు, కులము, ఆదాయము, ఆధారకార్డ్, స్కూల్ బోనఫైడ్ జిరాక్స్ కాఫీలు మరియు 2 ఫోటోస్ తో మీకు దగ్గరలో ఉన్న వసతి గృహాలములలో అడ్మిషన్ పొందవచున్నారు.మరిన్ని వివరాలకు మీకు దగ్గరలో ఉన్న వసతి గృహ సంక్షేమ అధికారులను సంప్రదించగలరు.