ప్రమాణస్వీకారానికి రండి..
` కార్యక్రమానికి హాజరు కావాలని సోనియా,రాహుల్, ప్రియాంక, ఖర్గేలను ప్రత్యేకంగా ఆహ్వానించిన రేవంత్
న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢల్లీి పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢల్లీికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ ఆయ్యారు. ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్ర నేత రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీలతో ఆయన సమావేశమయ్యారు. తనను సీఎల్పీ నేతగా ప్రకటించిన నేపథ్యంలో వారికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రేపు (గురువారం) హైదరాబాద్‌లో జరగబోయే తన ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించారు. అదేవిధంగా రాష్ట్రంలో మంత్రివర్గం కూర్పు, ఇతర అంశాలపై కూడా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో చర్చించారు. గురువారం రాష్ట్ర రాజధానిలోని ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ మేరకు రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.