ప్రమాదకరంగా ఫ్లెక్సీల వైఎస్ఆర్ సర్కిల్…
– వాహనాదారులకు ప్రమాదంగా మారిన మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న ఫ్లెక్సీలు
-ఫ్లెక్సీలను తొలగించాలని వాహనదారులు కోరుకుంటున్నారు
గద్వాల ప్రతినిధి అక్టోబర్ 18 (జనంసాక్షి):-ఈ మధ్య గద్వాల జిల్లా కేంద్రం లో టీఆర్ఎస్ నేతలు,బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు ప్రజా ప్రతినిధులు కొన్ని సందర్భాలలో జిల్లా కేంద్రంలోని వైయస్సార్ సర్కిల్ మరియు మున్సిపాలిటీ ఎదురుగా ప్రధాన రోడ్లు, కూడలిలా దగ్గర అనేకచోట్ల ప్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది.ఫ్లెక్సీలతో గద్వాల జిల్లా కేంద్రం మొత్తం పార్టీ ల మాయంగా మారింది. ఇప్పటికే దాదాపు కొన్ని రోజులు కావస్తోంది. అయినా కూడా మున్సిపల్ పరిధిలో ప్రమాదకరంగా ఉన్న పెద్ద పెద్ద ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించలేని పరిస్థితి. రోజు అధికారులు వచ్చి వెళ్లే ప్రధాన రోడ్డు అయినా, వాళ్లు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఏ ఒక్కరు ఫ్లెక్సీ తీసే సాహసం చేయడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఫ్లెక్సీలు తీసినప్పటికీ మరికొన్ని ప్రమాదకరమైన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అలాగే ఉంచడంతో అటుగా వెళ్ళే వాహనదారులు భయం తో వణికి పోతున్నారు. అసలే వర్షాలు, గాలి దుమారం వస్తుండడంతో ప్లెక్సీలు విరిగి మీద పడితే ప్రమాదం జరిగి, ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి. ఫ్లెక్సీలు తొలగించి మా ప్రాణాలు కాపాడాలని వాహనదారులు,ప్రజలు వేడుకుంటున్నారు….
ReplyForward
|