ప్రమాదపు ప్రయాణం.. వైరల్ ఫోటో…
– ప్రమాదానికి అంచున విద్యార్థులు
– పట్టించుకోని ఆర్టిఏ అధికారులు..
గద్వాల ప్రతినిధి అక్టోబర్ 21 (జనంసాక్షి):- విద్యార్థులకు బస్ కష్టాలు తప్పడం లేదు. సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గద్వాల పట్టణ విద్యార్థులు నానాకష్టాలు పడుతున్నారు. ఉన్న అరకొర బస్సులూ సమయానికి రావడం లేదు. దీంతో వచ్చిన బస్సులోనే తొందరగా వెళ్లిపోవాలనే ఆత్రుతతో విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.గద్వాల నుంచి దరూర్, అల్లపాడు, నందిన్నె, కేటీ దొడ్డి వైపు శుక్రవారం బస్ వెళ్తుండగా.. పట్టణంలోని పలు కళాశాల విద్యార్థులు పెద్దఎత్తున ఎక్కారు. లోపల స్థలం లేకపోవడంతో బస్ డోర్ దగ్గర నిలబడడంతో పాటు బస్ వెనక కూడా వేలాడారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న నర్సింహులు అనే వ్యక్తి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. విద్యార్థులు అలా ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నా.. బస్ కండక్టర్, డ్రైవర్ కనీసం స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా గద్వాల్ ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ ఆర్టీసీ అధికారులకు విద్యార్థులు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకుని వారికి చర్యలు పలు సూచనలు చేయాలని కోరుకుంటున్నారూ.
Attachments area