ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై విద్యుత్ ఆపరేటర్ మృతి

రంగంపేట గ్రామ నివాసి గడ్డమీది రాములు
జనం సాక్షి /కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందినవ మంచి నీటిని అందించే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను మరమ్మత్తు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ ఆపరేటర్ మృతి చెందిన సంఘటన కొల్చారం మండలం పైతర గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు… రంగంపేట గ్రామానికి చెందిన గడ్డమీది సిద్ధిరాములు(46) పైతర గ్రామ విద్యుత్ ఉపకేంద్రంలో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.ట్రాన్ ఫార్మర్ వద్ద తలెత్తిన విద్యుత్ సమస్యతో గ్రామానికి మంచినీటి సరఫరా రెండు రోజులుగా ఆగిపోయింది.దీంతో మధ్యాహ్నం విద్యుత్ ఉపకేంద్రం ద్వారా ఎల్సీ తీసుకొని మరమ్మతు చేస్తుండగా విద్యుత్ సరఫరా అయింది.దీంతో సిద్ధి రాములు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య రేణుకతో పాటు ఫాండీ చదువుతున్న కూతురు శ్రీవాణి, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారుడు అభితేజ ఉన్నారు.మృతుని భార్య ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కేసు నమోదు చేసుకుని,శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.                                *  మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలి…  ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైన సిద్ధిరాములు కుటుంబాన్ని ట్రాన్స్కో అధికారులతో పాటు,ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ బండి సుజాత ,ఎంపీటీసీ మాధవి, పైతర గ్రామ సర్పంచ్ సంతోష డిమాండ్ చేశారు.