ప్రమాదవశాత్తూ పొగాకు దగ్ధం.. రూ.3లక్షల నష్టం
ఖమ్మం : ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని పొగాకు పాక దగ్ధమై రూ.3లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ అగ్ని ప్రమాదం ఖమ్మం జిల్లా చర్ల మండలంలో మంగళవారం సంభవించింది. వివరాలు.. ఖమ్మం జిల్లా చెర్ల మండలం దండుపేట గ్రామంలో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకోవడంతో రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లుకు చెందిన 2 ఎకరాల పొగాకు పాక దగ్ధమయింది.