ప్రమాదవశాత్తూ రెండు పూరిళ్లు దగ్ధం
వెల్దుర్తి: మండలంలోని హస్తాలపూర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో రూ. 3లక్షలు ఆస్తి జరిగినట్లు బాధితులు తెలిపారు. గొల్ల నరసింహులు, గొల్ల మల్లేశం వ్యక్తులకు చెందిన పూరిళ్లు ప్రమాదవశాత్తూ దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో నరసింహులుకు చెందిన రూ.10వేల నగదు. రెండు తులాల బంగారం, 45 తులాల వెండి, మల్లేశంకు చెందిన రెండు తులాల బంగారం, 50 తులాలు వెండి, రూ.5000 నగదు కాలిపోయాయి. వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం జరగలేదు.