ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగాం : రైల్వే మంత్రి

న్యూఢిల్లీ : రైల్వే ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగామని రైల్వే శాఖ మంత్రి బన్సల్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. పెరిగిన ఆధునికీకరణ వల్ల రైలు ప్రమాదాలు బాగా తగ్గాయన్నారు. 40 శాతం ప్రమాదాలు లెవల్‌ క్రాసింగ్‌ల వల్లే జరుగుతున్నట్లు వివరించారు. 70 వంతెనలను, 17 పురాతన వంతెనల స్థానంలో కొత్త వాటిని వచ్చే ఏడాది నిర్మిస్తామన్నారు. 31,866 లెవల్‌ క్రాసింగ్‌ల ఆధునికీకరణకు 37 వేల కోట్లు కావాలని, రైలు ప్రమాదాల్లో మరణిస్తున్న ఏనుగుల రక్షణ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మహిళ ప్రత్యేక రైళ్లకు మహిళా భద్రతీ సిబ్బందిని నియమించనున్నామన్నారు. ప్రమాదరహితంగా రైల్వే  వ్యవస్థను తీర్చిదిద్దాలన్నాదే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.