ప్రమాద భీమాను సద్వినియోగం చేసుకోండి
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 16 : ప్రతి ఒక్కరూ పోస్ట్ ఆఫీస్ లో 399 రూపాయలతో ప్రమాద భీమా ఇన్సూరెన్స్ పాలసీ చేసుకుంటే 10 లక్షల రూపాయల ప్రమాద బీమా పొందవచ్చునని దూల్మిట్ట మండల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సుద్దాల నర్సింలు అన్నారు. మండలకేంద్రంలోనీ శాలిని ఎలక్ట్రికల్స్ వర్క్స్ కార్యాలయంలో కార్మికులచే పది లక్షల ప్రమాదా భీమా పాలసీ ఇన్సూరెన్స్లను చేపట్టారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ.. ప్రమాదవశత్తు ప్రజలకు విష పురుగులు, కరెంట్ షాక్, అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు, నీట మునగడం , కాళ్లు, చేతులు పోగొట్టుకోవడం లేదా గాయాలపాలై హాస్పిటల్ పాలవ్వడం లాంటి సంఘటనలు జరిగినప్పుడు సందర్భాలలో వారి కుటుంబానికి ఆసరాగా 10 లక్షల భీమా వర్తిస్తుందని అన్నారు. సంవత్సరానికి ఒకసారి పోస్ట్ ఆఫీస్ లో 399 రూపాయలతో ఈ ఇన్సూరెన్స్ చేసుకుంటే 10 లక్షల ప్రమాద భీమా లభిస్తుందని తెలిపారు. 18 సంవత్సరాల నిండిన విద్యార్థులు, యువకులు, 65 సంవత్సరాల లోపు ఉన్న వృద్ధులు ప్రతి ఒక్కరూ పోస్ట్ ఆఫీస్ వారిని సంప్రదించి ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవాలని నర్సింలు కోరారు.