ప్రమీల కుటుంభానికి ఆర్థికంగా సహకరించిన ట్రినిటీ స్కూల్

గత శనివారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి హాజరై రాత్రివేళలో తిరుగు ప్రయాణంలో రాంగ్ రూట్లో 30 మంది భక్తులతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారని, దాదాపు 15 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారనే సంగతి విధితమే. అయితే గురువారం మునగాల మండల కేంద్రంలోని ట్రినిటీ పాఠశాల చైర్మన్ ముల్లంగి వనజ జాకబ్ రాజు మృతి చెందిన చింతకాయల ప్రమీల కుటుంబానికి 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చింతకాయల ప్రమీల కుమార్తె కుసుమాంజలికి వారి నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ట్రినిటీ పాఠశాల చైర్మన్ ముల్లంగి వనజ జాకబ్ రాజు మాట్లాడుతూ, అయ్యప్పస్వామి దేవాలయంలో జరుగుచున్న పడిపూజ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న భక్తులు ఈ విధంగా దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. అయితే మృతి చెందిన కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆయన తీసుకున్న మంచి నిర్ణయానికి పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  ట్రినిటీ పాఠశాల యాజమాన్యం వీరస్వామి,  సావిత్రి, విద్యార్థినిలు పాల్గొన్నారు.