ప్రముఖ జానపద గాయకుడు ప్రభాకర్‌ మృతి

– మృతదేహం వద్ద నివాళులర్పించిన మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట, జనవరి18(జ‌నంసాక్షి) : సిద్దిపేటకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు (సాత్‌ పాడి) ఎస్‌. ప్రభాకర్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. కాగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ప్రభాకర్‌ మృతి వార్త తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు సిద్ధిపేటలోని స్థానిక భారత్‌ నగర్‌లోని ప్రభాకర్‌ నివాసానికి వెళ్లిన ప్రభాకర్‌ పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా జానపద కళలల అభివృద్ధికి ప్రభాకర్‌ సేవలను కొనియాడారు. అనంతరం కుటుంబ సభ్యులను తన సానుభూతిని వ్యక్తం చేశారు. మంత్రి వెంట స్థానిక తెరాస నేతలు ఉన్నారు.