ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం కన్నుమూత
చెన్నై: ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం (83) అనారోగ్యంతో కన్నుమూశారు. చైన్నైలోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 1929 అక్టోబర్ 25న కృష్ణా జిల్లా కూచిపూడిలో చినసత్యం జన్మించారు. నర్తనశాల సినిమాలో ఎన్టీఆర్ బృహన్నళ పాత్రకు నృత్యం కల్పన చేసి పేరు సంపాదించుకున్నారు. చైన్నైలో కూచిపూడి శిక్షణా లయాన్ని నిర్వహిస్తున్న చినసత్యం ప్రముఖ బాలీవుడ్ నటి హేమామాలిని, తెలుగు నటి ప్రభ, కేంద్ర మంత్రి పురంధశ్వరిలకు నాట్యగురువుగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఈయన్న పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.