ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల ప్రతినిధి అక్టోబర్ 16 (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షలో 82.46 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఆదివారం నాడు జిల్లా కలెక్టర్ పట్టణంలోని 15 సెంటర్ లు ఏర్పాటు చేయగా ఎస్ వి ఏం డిగ్రీ కళాశాల, ప్రాక్టీసింగ్ హై స్కూల్ , ల లో గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను సందర్శించి అభ్యర్థుల హాజరు, బయోమెట్రిక్ విధానం, పరీక్ష నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు.జిల్లాలో ఏర్పాటు చేసిన 15 పరీక్షా కేంద్రాలలో మొత్తం 4874 మంది అభ్యర్థులకు గాను 4019 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 855 మంది గైర్హాజరు అయ్యారని, 80.46 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. బయో మెట్రిక్ ద్వారా అభ్యర్థులను లోపలికి పంపించడం జరిగిందని,
ఛీఫ్ సూపరింటెండెంట్ల కు, లైషన్ అదికారులకు, అసిస్టెంట్ లైషన్ అధికారులకు ఎవ్వరికీ, ఎక్కడ ఎలాంటి సమస్య లు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించామని కలెక్టర్ తెలిపారు.