ప్రశాంతంగా బీహార్ పోలింగ్
– నాలుగో దశలో 57.59 శాతం ఓటింగ్ నమోదు
హైదరాబాద్ నవంబర్ 1 (జనంసాక్షి):
బిహార్ నాలుగోదశ ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 55 నియోజక వర్గాల్లో నేడు పోలింగ్ జరిగింది. 776 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 57 మంది మహిళలు. నాలుగో దశ ఎన్నికల్లో 57.59శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తర చంపారన్‌లో అత్యధికంగా 59.96శాతం, సివాన్‌లో అత్యల్పంగా 54.31శాతం పోలింగ్ నమోదైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ మోతిహరి నియోజకవర్గంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్ర సీనియర్ మంత్రి రామయ్ రామ్(బొచాహా), రంజు గీత(బాజ్‌పట్టి), మనోజ్ కుష్వాహ(కుద్ని) తదితర ప్రముఖులు నాలుగో దశ ఎన్నికల బరిలో ఉన్నారు. 14,139 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావం ఉన్న 3043 కేంద్రాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా..
– పశ్చిమ చంపారన్ – 59.17
– తూర్పు చంపారన్ – 59.96
– శియోహర్ – 56.05
– సిత్మర్హి – 56.09
– ముజఫర్‌పూర్ – 56.83
– గోపాల్‌గంజ్ – 58.90
– సివాన్ – 54.31