ప్రస్తుతం ఉన్న జూనియర్ కళాశాలల కన్నా ఆదర్శవంతమైన కళాశాల గా తీర్చిదిద్దేందుకు కృషి
జహీరాబాద్ జులై 23( జనంసాక్షి ) ప్రస్తుతం ఉన్న జూనియర్ కళాశాలల కన్నా ఆదర్శవంతమైన కళాశాల గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని జె ఎస్ కళాశాల కరెస్పాండంట్ ఇక్బాల్ జావీద్ పేర్కొన్నారు. జహీరాబాద్ పట్టణంలోని జె ఎస్ కళాశాల లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ హేమానంద్ తో కలిసి మాట్లాడుతూ ముందుగా తాము జహీరాబాద్ పట్టణంలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల ను ఇంటర్ తరువాత చదివే ఇంజనీరింగ్, మెడిసిన్, జె ఈ ఈ ,ఐ ఐ టి లాంటి వాటికి కోచింగ్ కోసం తీసుకెళ్లాలని వచ్చామని, అలాంటిది ప్రస్తుతం కళశాల ను ప్రారంభించమని చెప్పారు. లాక్ డౌన్ కాలంలో తాము ఆన్లైన్ కోచింగ్ ఇచ్చామని పలువురికి ఇంజనీరింగ్, మెడిసిన్ లలో ఫ్రీ సీట్లు వచ్చాయని తెలిపారు. తమ కళాశాలలో ప్రభుత్వం నిర్ధేశించిన సిలబస్ తో పాటు నీట్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐ టి, జె ఈ ఈ లాంటి వాటి కోచింగ్ ఇస్తామని అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులను తయారు చేయడమే అని కాకుండా, వృత్తి నిపుణులు గా తీర్చిదిద్దే విధంగా బోధన ఉంటుందన్నారు. జహీరాబాద్ పట్టణంలో 10వ తరగతి తర్వాత ఎం చదవాలి అన్న విషయం లో సరైన మార్గ నిర్ధేశం చేసే పరిస్థితి లేదని, తాము ఈ విషయం లో త్వరలో ఒక సెమినార్ నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. ఇక 7.5 జి పి ఎ వచ్చిన మైనారిటీ, ఎస్ సి,ఎస్. టి., ఆర్ధికంగా వెనుకబడి న వారికి ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తు ను వారు నిర్ణయించుకునేందుకు గాను అనుభవజ్ఞులతో కెరీర్ గైడేన్స్ సెల్ ను ప్రారంభిస్థామని అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో కళాశాల బ్రాంచ్ ఇంచార్జి మధు సుధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.