ప్రాచీన శివాలయానికి భారీ విరాళం
శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 21 శంకరపట్నం మండల పరిధిలోని తాటికల్ గ్రామంలో సుప్రసిద్ధ ప్రాచీన శివాలయ అభివృద్ధి కొరకు కోడూరి సాగర్ గౌడ్ బుధవారం తాడికల్ గ్రామంలో జరిగిన సమావేశంలో 11 లక్షల రూపాయలను శివాలయం అభివృద్ధికి విరాళంగా అందించారు ఈ విరాళాన్ని అందించినందుకు ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని గ్రామస్తులు కోరుకున్నారు తాడికల్ గ్రామ సర్పంచ్ కీసర సుజాత సంపత్ ప్రాచీన శివాలయ అభివృద్ధికి విరాళంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎంపీటీసీ మాజీ ఎంపీపీ దొంగల విజయ రాములు గ్రామ యువకులు పాల్గొన్నారు