ప్రాజెక్టులను పరుగుల పెట్టిస్తున్న మంత్రి హరీష్‌

ఆయన తీరు అందరికీ ఆదర్శం: ఎమ్మెల్యే
సిద్దిపేట,మే4(జ‌నం సాక్షి ): సిఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వం, మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో శరవేగంగా  కాళేశ్వరం పనులు సాగుతున్నాయని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. హరీస్‌ రావు పగలనక,రాత్రనక ప్రాజెక్టుల వెంటే నడుస్తున్నారని అన్నారు. నిర్దేవిత సమయంలో పూర్తి చేయాలన్న కెసిఆరన్‌ ఆకాంక్షలకు అనగుఉణంగా పనులను పరుగెత్తిస్తున్నారని  కొనియాడారు. వాయువేగంతో సాగుతున్న ప్రాజెక్టు పనులను చూసేందుకు కేంద్ర జలవనరుల సంఘం చీఫ్‌ ఇంజినీర్ల బృందం రావడంతో ప్రపంచ రికార్డు సృష్టించిందని చెప్పారు. గోదావరి, కృష్ణాలోని 1,200 టీఎంసీల నీటిని సాగుకు యోగ్యమయ్యే బీడు భూములకు పారించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.  ప్రాజెక్టులు సకాలంలో పూర్తయితే కోటీ 20లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. కోటి ఎకరాల నా తెలంగాణ అన్న నినాదాం సాకారం కానుందన్నారు.  తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ముందుకు పోతున్నారని పేర్కొన్నారు.  కులవృత్తులకూ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే విమర్వలు చేయడం ఆయా వృత్తుల వారిని అవమానించమే అన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.