ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేద్దాం

C

కార్యరంగంలోకి దూకండి

నీటిపారుదలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి): కృష్ణాగోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టుల పనులు సత్వరం పూర్తి చేయాలని సిఎం కెసిఆర్‌ ఇంజనీర్లతో చెప్పారు.   తెలంగాణ సస్యశ్యామలం చేసేవిధంగా పనులు వేగంగా జరగాలన్నారు. ప్రాజెక్టు పనులు, టెండర్లు, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో నక్కలగండి, పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సవిూక్ష సమావేశం నిర్వహించారు.  పాలమూరు, నక్కలగండి ఎత్తిపోతల పథకాలను వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండలాంటి జిల్లాలకు సమర్థవంతంగా సాగునీరు అందినప్పుడే రాష్టాన్రికి సార్థకత అని సీఎం అన్నారు. గోదావరి నదిపై చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి రీహేబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌ కమిషనర్లను నియమిస్తామన్నారు. ఇరిగేషన్‌ శాఖకు రెవెన్యూ, ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ను కూడా అదనంగా కేటాయిస్తామని తెలిపారు. కృష్ణా, గోదావరి నీళ్లను సమర్థవంతంగా వాడుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వకు చరిత్రలోనే మొదటిసారిగా రెండో పంటకు నీరు అందించినమని తెలిపారు.కృష్ణా, గోదావరి నదులపై ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని సీఎం అన్నారు. మంచి నీటి పథకం, విద్యుత్‌ ఉత్పత్తి మాదిరిగానే నీటిపారుదల ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయాలన్నారు. గోదావరి, కృష్ణా నీటిని సమర్థవంతంగా వినియోగించుకుని రాష్టాన్న్రి సస్యశ్యామలం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న కేటాయింపులతో పాటు మరో 120 టీఎంసీల వరకు అదనంగా రాష్టాన్రికి కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఈ నీటిని ఉపయోగించుకునే విధంగా ప్రజెక్టులను సిద్ధం చేయాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సవిూక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, విద్యాసాగర్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.