ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి…

 కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య….
జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 20(జనం సాక్షి):దేవాదాల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో దేవాదాయ ప్రాజెక్టు పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగాం జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు పరిధిలో 2 లక్షల 57 వేల ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు పనులు చేపట్టగా 1,37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతోందన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద విడుదల వారీగా చేపడుతున్న పనులలో 80 శాతం పనులు పూర్తయ్యాయి అన్నారు.అశ్వరావు పల్లి రిజర్వాయర్ కాలువ పనులు పురోగతిలోఉన్నాయన్నారు. అదేవిధంగా నవాబుపేట రిజర్వాయర్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. చెన్నూరు ట్యాంకు, పాలకుర్తి రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గండి రామారం రిజర్వాయర్ కుడి కాలువ పని మంజూరైనదని త్వరితగతిన చేపట్టి పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని 965 చెరువులు ఉండగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా 486 చెరువులు నింపడం జరుగుతుందని మిగిలిన 479 చెరువులను నింపేందుకు సర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, స్టేషన్గన్పూర్ ఆర్డిఓ కృష్ణవేణి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కొండల్ రెడ్డి, నీటిపారుదల అధికారులు సుధీర్, పల్లం రాజు, ప్రవీణ్, మంగిలాల్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.