ప్రాణం తీసిన లిఫ్ట్!
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని శ్రీచైతన్య స్టార్ కిడ్స్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ లిఫ్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి జహానా.. అక్కడికక్కడే మరణించింది. ఉదయం స్కూల్ కు వెళ్లిన జెహాన .. తోటి విద్యార్థులతో కలసి పైఅంతస్తులోని తరగతి గదికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లిఫ్ట్ గ్యాప్ లో ఇరుక్కోవడంతో జెహాన విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు షాక్ కు గురయ్యారు. ఇంటి నుంచి స్కూల్ కు వెళ్లిన పాప అంతలోనే మరణించిదన్న వార్త తెలియడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. స్కూల్ ముందు బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. అటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్ ను అరెస్టు చేశారు. పాఠశాలను సీజ్ చేశారు.