ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పండ్లు పంపిణీ

చేసిన ఎంపిపి, ఎంపిటిసి
జగదేవ్ పూర్ , ఆగస్టు 19జనంసాక్షి : 75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జగదేవ్ పూర్  మండల కేంద్రం లో స్థానిక  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు జగదేవ్ పూర్  మండల మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి  ఆధ్వర్యంలో ఎంపీపీ అధ్యక్షులు మెరుగు బాలేషంగౌడ్ పలువురు నాయకులు  గర్భిణీ స్త్రీ లకు,వృద్దులకు పండ్లు, బ్రెడ్ లు పంపిణీ చేశారు. అదే విధంగా జగదేవ్ పూర్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మహేష్ కుమార్   అత్యధికంగా సుఖ ప్రసవ కేసులు చేసినందుకు గాను జిల్లాలో ఉత్తమ వైద్యాధికారిగా అవార్డు పొందడం పట్ల ఆయనను అభినందిస్తూ శాలువాలతొ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో  స్థానిక సర్పంచ్ కొత్త లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కో-ఆప్షన్ సభ్యులు ఇక్బాల్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్,  వార్డు సభ్యుడు కె మహేష్, కో-ఆప్షన్ సభ్యులు బి గాల్ రెడ్డి, టీఆర్ఎస్  గ్రామశాఖ అధ్యక్షులు బుద్ద నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ కళ్యాణ్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.