ప్రాథమిక పాఠశాలలో ఉత్సాహంగా బాలసభ.
నెన్నెల, అక్టోబర్ 15, (జనంసాక్షి)
నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులచే పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో గత నెల సమావేశంలో తెలిపిన అంశాలపై చర్చించారు. విద్యార్థుల ప్రగతి, ఏయే అంశాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారో పేరెంట్స్ కు అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా పేరెంట్స్ చూడాలని కోరారు. ఎఫ్ఎల్ఎన్ ప్రాముఖ్యతను పేరెంట్స్ వివరించారు. ప్రతి రోజు ఇంటి విద్యార్థుల చదువులపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులచే బాలసభ నిర్వహించారు. ఈసభలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఏయే రంగాల్లో ప్రతిభ ఉందో తెలుసుకోవడానికి బాలసభ ఉపయోగ పడుతుందని వారు. వివరించారు. ఈరోజు నో బ్యాగ్ డే కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా ఆటలు, పాటలు, కథలు, వివిధ పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఉపాద్యాయులు వనజ,ఉమా విద్యార్థులు పాల్గొన్నారు.