ప్రారంభమైన ఆర్టీసీ ఎన్నికల పోలింగ్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ఉదయం 5 గంటలకు ప్రారంభించారు. మొత్తం 23 రీజయన్లలోని 211 డిపోల్లో , 8నాన్ ఆపరేషన్ జోన్లలో పోలీంగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. 1 లక్ష 16 వేల మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6.30కు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల బరిలో 10 సంఘాలు పోటీపడుతున్నాయి. అయితే టీఎంయూ, ఈయూ, నేషనల్ మజూరు యేనియన్ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది.