ప్రారంభమైన బండి నిరసన దీక్ష
కరీంనగర్ లోని తన నివాసంలో ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘‘నిరసన దీక్ష ’’ ప్రారంభించారు.
కేసీఆర్ సర్కార్ అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా ‘నిరసన దీక్ష’లు చేస్తున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి
కరీంనగర్ ‘నిరసన దీక్ష’లో పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, పాదయాత్ర సహ ప్రముఖ్ జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమదేవి, జె.సంగప్ప, దరువు ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘నిరసన దీక్ష’ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది.