ప్రేమపేరుతో వేధింపులకు బాలిక ఆత్మహత్య

పెన్‌పహాడ్‌,  ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌ మండలం లింగాల గ్రామానికి చెందిన బాలిక ఎల్లావుల శ్రావణి(15) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. లింగాల గ్రామానికి చెందిన మేకల వినోద్‌ శ్రావణిని ప్రేమపేరుతో నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. శ్రావణి 10వ తరగతి చదువుతోంది. నెల రోజులుగా మేకల వినోద్‌ నిన్ను ప్రేమిస్తున్నాను… నువ్వు నన్ను ప్రేమించాలని వెంటపడ్డాడు. విషయాన్ని శ్రావణి తల్లిదండ్రులు రామలింగయ్య, నాగమ్మలకు చెప్పింది. వారు వినోద్‌ తల్లిదండ్రులు మేకల అంజయ్య, మణెమ్మ వద్దకు వెళ్లి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. మళ్లీ వారం రోజుల తర్వాత శ్రావణికి వినోద్‌ ఫోన్‌, మేసేజ్‌లు ద్వారా వేధింపసాగాడు. మనస్తాపం చెందిన శ్రావణి ఇంట్లో ఎవరు లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.