ప్రేమ పేరుతో మోసం…యువతి ఆత్మహత్యాయత్నం

నల్గొండ, సెప్టెంబరు 10 : అనుముల మండలం శ్రీరాంపల్లిలో ప్రేమ పేరుతో ఓ యువతిని సర్పంచ్‌ సుదర్శన్‌ మోసం చేశారు. ప్రేమించానని చెప్పి…ఆపై పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో యువతిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.