ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు కంప్యూటర్ బోధన
మెదక్, నవంబర్ 8 : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించనున్నట్టు మండల విద్యాశాఖాధికారి ఎం సాయిబాబా తెలిపారు. గురువారం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ 8పాఠశాలలకు కంప్యూటర్లు అందించామని తెలిపారు. విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు ప్రదీప్ కుమార్‌ను నియమించినట్లు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న బోజన పథకంలో కొత్త మెనూను ప్రారంభించామని తెలిపారు. వారానికి ఒకరోజు కోడిగుడ్డు, అరటిపండు విద్యార్థులకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 11,12 తేదీలలో 20సూత్రాల పథకంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.