ప్రైవేటు ఫీజులూంను నియంత్రిస్తాం

1

– కడియం

హైదరాబాద్‌,జులై 19(జనంసాక్షి):పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సవిూక్ష తర్వాత వివరాలను ఆయన విూడియాకు వెల్లడించారు. ఫీజుల నియంత్రణపై అన్ని స్కూళ్లలో పేరెంట్స్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని కడియం చెప్పారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న 12 ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, 162 ప్రైవేట్‌ స్కూళ్లకు నోటీసులు ఇచ్చినమని వెల్లడించారు. ఆ స్కూళ్లు ఇచ్చిన సమాధానాలను విశ్లేషించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి జీవో 42 పై హైకోర్టు స్టే విధించిందని, స్టే ఎత్తివేసినా, వేరే ఆదేశాలు ఇచ్చినా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 31 లోపు విద్యా వాలంటీర్లను భర్తీ చేస్తామని, యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్ల నియామకం పూర్తి అవుతుందని తెలిపారు.ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఇప్పటికే 66 వేల సీట్లు భర్తీ అయినయని ఉప ముఖ్యమంత్రి వివరించారు. అనుబంధ గుర్తింపు పొందని 70 ఇంజినీరింగ్‌ కాలేజీలు కౌన్సిలింగ్‌ కు అవకాశం ఇవ్వాలని కోర్టుకు వెళ్లినయని చెప్పారు. కోర్టుకు వెళ్లిన అన్ని కాలేజీలకు నోటీసులు ఇచ్చినమన్నారు. మూడు రోజుల్లో రీ వెరిఫికేషన్‌ నిర్వహించి అర్హత ఉన్న కాలేజీలను కౌన్సిలింగ్‌ కు అనుమతిస్తామని ప్రకటించారు.రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు పీఏలు, పీఎస్‌ లుగా 41 మంది టీచర్లు పనిచేస్తున్నారని కడియం చెప్పారు. వారిని సొంత విధుల్లోకి వెళ్లాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేస్తామని తెలిపారు. విద్యారంగ సమస్యలు, ఫీజులు తదితర అంశాలపై  ఉన్నతాధి కారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సవిూక్ష నిర్వహించారు. సవిూక్ష అనంతరం కడియం శ్రీహరి విూడియాతో మాట్లాడుతూ ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఫీజుల నియంత్రణపై అన్ని స్కూళ్లలో పేరెంట్స్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న 12 ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, 162 ప్రైవేట్‌ స్కూళ్లకు నోటీసులు ఇచ్చినమని తెలిపారు. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఇప్పటికే 66వేల సీట్లు భర్తీ చేసినట్లు వెల్లడించారు. 70 ఇంజినీరింగ్‌ కాలేజీలు అఫిలియేషన్‌పై కోర్టుకు వెళ్లినయని..కోర్టుకు వెళ్లిన అన్ని కాలేజీలకు నోటీసులు ఇచ్చినమని పేర్కొన్నారు. జులై 31లోపు విద్యావాలంటీర్లను భర్తీ చేస్తమని స్పష్టం చేశారు. జులై31లోపు వీసీల నియామకం పూర్తవుతుందని తెలిపారు.