ప్రైవేట్‌ బస్సును ఢీకొన్న డిసిఎం

డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నల్గొండ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): నల్గొండ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చిట్యాల మండలం వెలిమినేడు హైవేపై ఈ ఘటన జరిగింది. ముందు వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో… అప్పటికే వేగంగా వెనుకనే వస్తున్న డీసీఎం అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన డీసీఎం డ్రైవర్‌ను సవిూపంలోని జీఎమ్మార్‌ సిబ్బంది నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వర్షం కారణంగానే డీసీఎం అదుపుతప్పి ప్రమాదానికి గురైందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.