ప్రైవేట్‌ బస్సు బోల్తా : ఇద్దరు మృతి

నల్లగొండ,జూన్‌19(జ‌నం సాక్షి): నల్గొండ జిల్లా వేములపల్లి మలుపు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. లక్ష్మీగాయత్రి ట్రావెల్స్‌ కు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తోంది. మంగళవారం వేకువజామున వేగంగా ప్రయాణిస్తున్న బస్సు వేములపల్లి వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ ఘటనలో గాయపడిన 15మందిని సవిూపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళుతుండగా లక్ష్మీగాయత్రీ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. అతివేగం.. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు.