ప్రైవేట్ పాఠశాలలో దోపిడీని అరికట్టాలి

BDSF రాష్ట్ర కన్వీనర్ భూక్యా రమేష్ డిమాండ్
 కడెం  జూన్25(జనంసాక్షి) ప్రైవేట్ పాఠశాలలో అనేక రకాలుగా దోపిడీ చేస్తున్నారు ఒక దిక్కు అధిక ఫీజులు మరో పక్క చూస్తే డ్రెస్సు బెల్టు టై అంటూ పుస్తకాలు నోట్స్ అంటూ బస్ చార్జీలు అంటూ అనేక రకాలుగా దోపిడీ చేస్తున్నారు. విజయం ఒక వ్యాపారంగా మలుచుకొని ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు. కొన్ని పాఠశాలలకు అనుమతి లేకుండా నడిపిస్తున్నారు అలాంటి పాఠశాలను వెంటనే రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి  గత రెండు సంవత్సరాల క్రితం ఉన్న ఫీజుల కంటే బస్సుల పేరుట వసూలు చేస్తున్నట్టు ఫీజులు డీజిల్ చార్జీలు పెరిగాయి అంటూ గతం కంటే 40 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారు ఏ పాఠశాలలో కూడా సరైన నిబంధనలు పాటించకుండా వారి ఇష్టానుసారంగా పాఠశాలలను నడిపిస్తున్నారు చట్టాలను తుంగలో తొక్కి ప్రైవేట్ సామ్రాజ్యం నడిపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఫీజులు కట్టడి చేయాలని జిల్లా విద్యాధికారి ప్రతి పాఠశాల సందర్శించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బి డి ఎస్ ఎఫ్ డిమాండ్ చేస్తుంది లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ హెచ్చరిస్తుంది.అని  బి డి ఎస్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్  భూక్యా రమేష్. అన్నారు