ప్లాంట్‌ హెల్తె క్లినిక్‌ ప్రారంభం

హైదరాబాద్‌: తక్కువ పెట్టుబడితో ఎక్కువ ద్రాక్ష దిగుబడులనిచ్చే పరిజ్ఞానాన్ని రైతులకు తెలియజేయాలని శాస్త్రవేత్తలను కోరునట్లు ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోదన సంస్థలో ఆయన పాంట్ల హెల్త్‌ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ద్రాక్షకు సంబంధించిన భూసారం, మొక్కల పరీక్షలను ఈ కేంద్రంలో రైతులు చేపుకోవచ్చని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసులు కోరారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో పెరిగే వంగడాలను రూపోందిచాలను ఆయన శాస్త్రవేత్తలను కోరారు. దీంతో దిగుబడి తక్కువ వచ్చినా రైతులు నష్టాలనుంచి గట్టెక్కుతారని తెలిపారు.