ప్లాస్టిక్‌తో పర్యావరణ ముప్పు
మెదక్,మే22(జనం సాక్షి): మెదక్ జిల్లాలో బహిరంగంగా ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై కసరత్తు చేస్తున్నారు. ప్లాస్టిక్ కారణంగా గ్రామాల్లో చెత్తాచెదారం పేరుకుని పోతోంది. బహిరంగ మలవిసర్జనతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, దీన్ని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని వాడాలని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. బహిరంగ మలవిసర్జన వల్ల అనారోగ్యానికి గురై ఒక్కో కుటుంబం రూ.50వేల వరకు దవాఖానలకు ఖర్చు చేసుకోవాల్సి వస్తోందన్నారు. 10శాతం మంది మరుగుదొడ్లు వాడకపోయినా రోగాలు సంక్రమిస్తాయన్నారు. పరిసరాలను సైతం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్లాస్టిక్ కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని, మురికి కాలువల్లో దోమలు పెరగడానికి ఇవి దోహదపడుతున్నాయని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు మనుషుల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందన్నారు. రోజు ఇంటి ముందుకు వచ్చే చెత్త బండిలో తడిపొడి చెత్తతో పాటు ఎ/-లాస్టిక్ వస్తువులు వేరుగావేయలన్నారు. మహిళల కృషి ఉంటే స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు అవసరమైన ఏర్పాట్లను చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా గ్రామాలలో
ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన తూప్రాన్, బ్రాహ్మణపల్లి, అల్లాపూర్, రావెళ్లి పంచాయతీలను మినహాయించి మండలంలోని మిగతా 14 పంచాయతీలకు, వాటి పరిధిలోకి వచ్చే మరో 114 వార్డులకు గానూ త్వరలో ఎన్నికలను నిర్వహించ నున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలను వారు పరిశీలించారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో అధికారులున్నట్లు సమాచారం.