ఫలించిన ఆర్టీసీ కార్మికుల పోరాటం
హైదరాబాద్: ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాటం ఫలించింది. ఇటీవల జరిగిన చర్చల్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి అంగీకరించిన యాజమాన్యం వీటిపై ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కార్మికులందరికీ నెలకు 3 సెలవులు మంజూరు చేయాలని ఆర్టీసీ ఎండీ ఎకే ఖాన్ నిర్ణయించారు. డబుల్ డ్యూటీ చేసిన కార్మికులకు రెట్టింపు వేతనం ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లు, డిపోల్లో మరుగుదోడ్లు, విశ్రాంతి గదుల నిర్వహన, నిర్మాణం కోసం 2.51 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఎస్ఎంయూ నేత నాగేశ్వరరావు తెలిపారు.



