ఫీజు బకాయిల్ని విడుదల చేయాలని సబ్ కలెక్టర్ కు వినతి

 

 

 

 

 

 

 

 

మెట్పల్లి టౌన్, డిసెంబర్ 14,
జనం సాక్షి :
గత రెండు సంవత్సరాలు గా పెండింగ్ లో ఉన్న ఫీజు రీ ఎంబర్స్ మెంట్ మరియు స్కాలర్ షిప్ ఫీజుల్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో బుధవారం మెట్ పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం(డిప్యూటీ తహశీల్దార్) లో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జిల్లాపెల్లి దిలీప్ మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ, పీజీ మరియు ప్రొఫెషనల్ కళాశాలల ఫీజు రియంబర్స్ మెంట్ మరియు స్కాలర్ షిప్ ల్ని ఎప్పటికప్పుడు విడుదల చేయకుండా, ఎస్సి, ఎస్టీ, బీసీ విద్యార్థులు వారంతట వారే చదువులకు దూరం కావాలన్న ఉద్దేశ్యం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫీజుల్ని విడుదల చేయపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు కూడా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని గత రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న 3300 కోట్ల రూపాయల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక కమలాకర్, మెట్ పల్లి పట్టణ అధ్యక్షులు పసునూరి శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు కంతి రమేష్, యువజన సమితి నియోజకవర్గ అధ్యక్షుడు వన్నెల శశి, విద్యార్థి నాయకులు కేశపాక తరుణ్ కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.