ఫుడ్ పాయిజన్ 30మంది విద్యార్థులకు అస్వస్థత
ఖమ్మం: ఖమ్మం జిల్లా ములకలపల్లిలో ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ఈ విషయంపై స్పందించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.