ఫెడరల్‌ స్ఫూర్తికి విద్యుత్‌ బిల్లు విఘాతం

` విద్యుత్‌ బిల్లును రాష్ట్రంపై రుద్దడం సరికాదు
` డబుల్‌ ఇంజిన్‌ పేరుతో కేంద్రం డ్రామాలు ఆడుతోంది
` అసెంబ్లీలో విద్యుత్‌ చర్చపై భట్టి విక్రమార్క
హైదరాబాద్‌(జనంసాక్షి):కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్‌ బిల్లు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం విద్యుత్‌ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన స్వల్పకాలిక చర్చలో భట్టి మాట్లాడారు. ఉమ్మడి జాబితాలోని విద్యుత్‌ పై కేంద్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే కొత్త విద్యుత్‌ బిల్లును తీసుకొచ్చిందని మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన విద్యుత్‌ బిల్లులపై అభ్యంతరాలున్నాయన్నారు. కేంద్రం చట్టం తెచ్చి రాష్టాల్రు అమలు చేయాల్సిందే అనడం సరికాదన్నారు. ఇది ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జాతి సంపదను అమ్ముకుంటూ పోతోందని, సంపదనంతా ఇద్దరి చేతుల్లో పెడుతోందని ఫైర్‌ అయ్యారు. ఒక్కో రాష్టాన్రికి ఒక్కో సమస్య ఉంటుందని, కానీ కేంద్రం రైతుల మోటర్లకు విూటర్లు పెడుతాననడం ఏమాత్రం కరెక్ట్‌ కాదన్నారు. ఉచితాలు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, కానీ ప్రజలకు ఇచ్చిన ఉచితాలతో పోల్చుకుంటే పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన సబ్సిడీలు, రుణ మాఫీలు చాలా ఎక్కువ అని అభిప్రాయపడ్డారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని బీజేపీ నాయకులు చెబుతున్నారని, సింగిల్‌ ఇంజిన్‌ తో ప్రజలకు అభివృద్ధి చేయలేమా అంటూ ప్రశ్నించారు.ప్రతి పక్షాలు అధికారంలో ఉన్న రాష్టాల్రకు నిధులివ్వకుండా డబుల్‌ ఇంజిన్‌ పేరుతో డ్రామాలాడు తున్నారని బీజేపీ నాయకులపై ్గªర్‌ అయ్యారు. చట్టపరంగా రాష్టాల్రకు రావాల్సిన వాటాలను అడ్డుకుంటూ కక్షసాధింపు చర్యలకు మోడీ పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ కోవలోనే రకరకాల చట్టాలు తెస్తూ రాష్టాల్ర అధికారాలకు కత్తెర వేస్తున్నారని చెప్పారు. రాష్టాభ్రివృద్ధి కోసం కేంద్రం ప్రభుత్వం త్టటెడు మట్టిపోసిందా అని ప్రశ్నించారు. మోడీ ఫోటోలు పెట్టాలని బీజేపీ మంత్రులు ఏకంగా ఓ కలెక్టర్‌ నే బెదిరించడం సిగ్గు చేటన్నారు.  అంతకు మందు పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ సమస్యలపై మాట్లాడానికి ప్రయత్నించిన మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అడ్డుకున్నారు. స్జబెక్ట్‌ పైనే మాట్లాడాని మంత్రి భట్టికి సూచించారు. అయితే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సమయం కేటాయించాలని భట్టి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని కోరారు.  గురుకులాల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు