ఫేవరెట్లు చెన్నయ్,ముంబాయి
క్రికెట్‌లో ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్‌ది ప్రత్యేక స్థానం. ఈ టోర్నీ జరిగే రెణ్నెల్లు క్రికెట్ ప్రేమికులకు పండగే. వరల్డ్‌కప్‌లో అయినా కొన్ని మ్యాచ్‌లకు స్టేడియాలు వెలవెలబోతాయోమోగానీ ఐపీఎల్‌లో మాత్రం ఆ పరిస్థితి కనిపించదు. ఆరో అంచెలో కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది. మే 26న జరిగే ట్రోఫీ అందుకునేందుకు తొమ్మిది జట్లూ సర్వ శక్తులూ ఒడ్డనున్నాయి.
డిపెండింగ్ చాంపియన్ కోల్‌కత్తా, చెన్నయ్, ముంబయితోపాటు బెంగళూరు, ఢిల్లీ అవకాశాలనూ కాదనలేం. విదేశీ ఆటగాళ్లలో క్రిస్ గేల్ వంటి స్టార్లపై భారీగానే అంచనాలున్నాయి. నా మట్టుకైతే చెన్నయ్, ముంబయి ఇండియన్స్ టైటిల్ ఫేవరెట్స్.