ఫైబర్‌ గ్రిడ్‌ పనులపై కేటీఆర్‌ అసంతృప్తి

2

హైదరాబాద్‌,ఆగస్టు 2(జనంసాక్షి):తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపైన మంత్రి కెటి రామారావు సమావేశం నిర్వహించారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు అధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీలతో మంత్రి సమావేశమయ్యారు.భగీరథ పనులు జరుగుతున్నంత వేగంగా ఫైబర్‌ గ్రిడ్‌ పనులు జరగడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కారణాలేంటని వర్కింగ్‌ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ పనులు వేగంగా జరిగేందుకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. పైప్‌ లైన్‌ తవ్వకాలతో పాటే కచ్చితంగా ఫైబర్‌ డక్ట్‌ వేయాల్సిందే అన్నారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు కాంట్రాక్టులోనే ఫైబర్‌ గ్రిడ్‌ పనుల నిబంధన ఉందన్న విషయాన్ని మరవరాదన్నారు. ప్రతి ఇంటికి, పల్లెకి విజ్ఞాన వెలుగులు వస్తాయన్న నమ్మకంతోనే ఫైబర్‌ గ్రిడ్‌ ను మొదలుపెట్టామని, ఈ కలను సాకారం చేసే క్రమంలో అవసరమైతే కఠినంగా కూడా వ్యవహరిస్తామని ఏజెన్సీలను హెచ్చరించారు. మంత్రి అభిప్రాయాలు, ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్నామని, ఆయన ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని వర్క్‌ ఏజెన్సీ ప్రతినిధులు చెప్పారు. అయితే ఫైబర్‌ గ్రిడ్‌ పనులపై ఖీచిూడజీఎజూ;ూ అధికారుల నుంచి కొంత స్పష్టత కావాలన్నారు. ముఖ్యంగా జిల్లా ఎస్‌.ఈలతో మరింత సమన్వయం ఉండాలన్నారు. వర్క్‌ ఏజెన్సీ ప్రతినిధులకు కావాల్సిన వర్క్‌ అర్డర్లు, ఫైబర్‌ గ్రిడ్‌ కు అవసరమై చాంబర్స్‌, జాయింటింగ్‌ వంటి సివిల్‌ నిర్మాణ పనుల తాలుకు అన్ని అనుమతులతో కూడిన పత్రాలను నిబంధనల ప్రకారం ఇవ్వాలని అధికారులను అదేశించారు. సమావేశంలో పాల్గొన్న మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ రెడ్డి ని ఫైబర్‌ గ్రిడ్‌ పనులను ప్రత్యేకంగా సవిూక్షించాలన్నారు. అందుబాటులో ఉన్న వెండర్‌ నుంచి గ్రిడ్‌ కు అవసరం అయిన డక్ట్‌ పైపులను కొని పనులు ప్రారంభించాలన్నారు. డక్ట్‌ వేసేందుకు అవసరమైన ఇంజనీరింగ్‌ మాన్యూవల్‌ ను అందరకి ఇవ్వాలని అధికారులను కె.టి.రామారావు అదేశించారు. ప్రభుత్వం లక్ష్యం మేరకు మిషన్‌ భగీరథ పనులు జరుగుతున్నాయన్న వైస్‌ ఛైర్మెన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఇక నుంచి తానే ఫైబర్‌ గ్రిడ్‌ పనులను స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. భగీరథతో ప్రాజెక్టుతోతాగునీటితోపాటు, ఇంటింటికి ఇంటర్‌ నెట్‌ అందించి దేశానికే ఆదర్శంగా నిలుస్తామన్నారు. ఈ సమావేశంలో ఐటి శాఖ, మిషన్‌ భగీరథ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.