ఫ్యానుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

హుజూర్ నగర్ సెప్టెంబర్ 12 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల ఓజో ఫౌండేషన్ కార్యాలయం నందు ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న మఠంపల్లి మండలం బాడవ తండాకు చెందిన బానోతు వెంకటేష్ (25) ఆదివారం రాత్రి ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోవడంతో సోమవారం ఎస్సై వెంకట్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవాన్ని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని పెద నాన్న కుమారుడు బానోతు శ్రీను పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వెంకట్ రెడ్డి తెలిపారు.